pawan kalyan: శత్రువైనా మిగలాలి.. నేనైనా మిగలాలి: పవన్ కల్యాణ్

  • జనసేన కవాతు బల ప్రదర్శన కాదు
  • ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేసే ఒక కార్యక్రమం
  • జగన్ కూడా బాధ్యతగా వ్యవహరించాలి

జనసేన కవాతు బల ప్రదర్శన కాదని... ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేసే ఒక కార్యక్రమమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దాదాపు పది లక్షల మంది ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు చేశారని... తద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. నిజంగా బల ప్రదర్శన చేయాల్సి వస్తే, పరిస్థితి మరోలా ఉంటుందని.... అప్పుడు శత్రువైనా మిగలాలి లేదా తానైనా మిగలాలని అన్నారు.

జనసైనికులు తనను చూడటానికో, పలావు ప్యాకెట్ కో, సారా ప్యాకెట్ కో ఆశపడి రాలేదని పవన్ చెప్పారు. దోపిడీ ప్రభుత్వాలను హెచ్చరించేందుకే వచ్చారని తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్ కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యమంత్రి అయ్యాక ఏదో చేస్తానని చెబితే ఎలా కుదురుతుందని... అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన బాధ్యత ఆయనపై లేదా? అని ప్రశ్నించారు. జనసేన నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ పవన్ పైవిధంగా స్పందించారు.

More Telugu News