రాజకీయ అరంగేట్రం చేసిన షమీ భార్య జహాన్
- కాంగ్రెస్ పార్టీలో చేరిన జహాన్
- ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ సమక్షంలో పార్టీలో చేరిక
- బాలీవుడ్ లో అవకాశాల కోసం యత్నిస్తున్న జహాన్
మరోవైపు, షమీతో జహాన్ కు విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. షమీతో పాటు అతని కుటుంబసభ్యులు తనను శారీరకంగా హింసించారని, అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పోలీసు కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో షమీ బీసీసీఐ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు షమీని బీసీసీఐ మళ్లీ తీసుకుంది.