Pawan Kalyan: నేను కాపు కులానికి చెందిన వాడిని.. మా బంధువుల్లో కూడా పేదలు ఉన్నారు: పవన్ కల్యాణ్

  • కాపులు సామాజికంగా వెనుకబడి ఉన్నారు
  • బీసీలకు నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి
  • కాపు రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టేలా కృషి చేస్తా
జనసేన పార్టీ నిర్వహించిన కవాతులో కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లేవనెత్తారు. బీసీలకు నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తాను కూడా కాపు కులానికి చెందిన వ్యక్తినేనని... తమ బంధువుల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారని చెప్పారు. కాపులు సామాజికంగా వెనుకబడి ఉన్నారని... రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను పెంచాలని తెలిపారు. కాపు రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టేలా కృషి చేస్తానని అన్నారు. 
Pawan Kalyan
kapu
reservations
janasena

More Telugu News