ntr: 'అరవింద సమేత' నుంచి 'రెడ్డెమ్మ తల్లి' కవర్ సాంగ్

  • హృదయాన్ని దోచుకునే మాటలు 
  • మనసును కదిలించే పాటలు
  • పెంచల్ దాస్ పాడిన కవర్ సాంగ్           

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధాన  ఆకర్షణగా నిలిచింది. ఏ పాటకు ఆ పాటే ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా 'రెడ్డెమ్మ తల్లి' అనే కవర్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సినిమాలో ఫిమేల్ వాయిస్ తో సాగే పాట వినిపిస్తుంది. కవర్ వీడియో కోసం ఈ సాంగ్ ను పెంచల్ దాస్ పాడాడు. ఈ పాటను రాసినది కూడా ఆయనే కావడం విశేషం.

రికార్డింగ్ థియేటర్లో పెంచల్ దాస్ పాడుతుండగా .. తమన్ రికార్డు చేస్తున్నటు వంటి ఈ వీడియోను వదిలారు. "ఊరికి ఉత్తారాన .. దారికి దక్షిణాన .. నీ పెనిమిటి కూలినాడమ్మా .. రెడ్డమ్మ తల్లి " అంటూ ఈ పాట సాగుతోంది. పెంచల్ దాస్ వాయిస్ లోని ప్రత్యేకత ఈ పాటకు జీవం పోసింది. ఆవేదనా భరితమైన ఈ పాటలో మనసుపై బలంగా నాటుకునే పదాలు వున్నాయి. మనసును మరింత భారం చేసే అర్థాలు వున్నాయి.

More Telugu News