Mujafarpur: ప్రజలను ఇబ్బందులు పెట్టిందంటూ రవీనా టాండన్ పై కోర్టుకెక్కిన న్యాయవాది!

  • 12న ముజఫర్ పూర్ నగరంలో పర్యటించిన రవీనా
  • ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన నటి
  • ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందంటూ కోర్టులో పిటిషన్
బీహార్ లోని ముజఫర్ పూర్ నగరంలో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించిందంటూ ప్రముఖ నటి రవీనా టాండన్ పై కేసు నమోదైంది. ఈ నెల 12వ తేదీన ఆమె నగరంలో పర్యటించిన సమయంలో ఓ హోటల్ ను ప్రారంభించింది. ఈ సమయంలో ట్రాఫిక్ భారీగా స్తంభించిందని, వందలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయని, గంటల తరబడి ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపిస్తూ, ఓ న్యాయవాది చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.

 రవీనాతో పాటు హోటల్ యజమానులు ప్రణవ్ కుమార్, ఉమేష్ సింగ్ లనూ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. అనుమతి లేకుండా సమావేశాలు జరపడం, ప్రజా జీవనానికి విఘాతం కలిగించడం తదితర అభియోగాలు మోపుతూ ఐపీసీలోని పలు సెక్షన్లను ఆయన ఉదహరించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి వాదనలను నవంబర్ 2కు వాయిదా వేసింది.
Mujafarpur
Raveena Tandon
Court Case
Traphic
Petition

More Telugu News