Google Street View: ఆమె మోసాన్ని 'గూగుల్ స్ట్రీట్ వ్యూ' పట్టేసింది.. భర్త విడాకులు ఇచ్చేశాడు!

  • వేరొక వ్యక్తితో సన్నిహితంగా గడిపిన మహిళ
  • ఫోటోలు తీసిన గూగుల్ కెమెరా కారు
  • తాజాగా భర్త కంటపడ్డ ఫోటోలు

2013లో ఆమె చేసిన తప్పు తాజాగా ఆధారాలతో సహా బయటపడింది. దీంతో ఆ మహిళ తన తప్పును ఒప్పుకోక తప్పలేదు. వెంటనే భర్త ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ వింత ఘటన పెరూ దేశంలో జరిగింది. గూగుల్ స్ట్రీట్ వ్యూ వాహనాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రదేశాలను 360 డిగ్రీల కోణంతో దృశ్యాలను రికార్డు చేస్తాయి. పెరూ రాజధాని లిమాలో ఓ వివాహిత వేరొక వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఓ పేరుపొందిన బ్రిడ్జి వద్ద గడిపింది.

గూగుల్ కెమెరా కారు ఆ ఫొటోలను తీసేసింది. ఈ ఘటన 2013లో జరిగింది. తాజాగా ఆ మహిళ భర్త లిమాలోని అదే బ్రిడ్జి కోసం గ్యూగుల్ మ్యాపులో శోధించాడు. అయితే అతడికి తన భార్య ఫోటోలు కనిపించాయి. వెంటనే ఆమెను గుర్తు పట్టిన భర్త ఆధారాలతో సహా బయటపెట్టాడు. దీంతో  ఆ మహిళకు తన తప్పును అంగీకరించక తప్పలేదు. వెంటనే వారిద్దరూ విడాకులు తీసుకున్నట్టు స్థానిక మీడియా తెలిపింది. అయితే వారిద్దరూ తమ పేర్లు వెల్లడించడానికి మాత్రం ఇష్టపడలేదు. 

More Telugu News