jabardast Programme: ‘జబర్దస్త్’ కార్యక్రమాన్ని నిరసిస్తూ ర్యాలీ.. దిష్టిబొమ్మల దహనం

  • గల్ఫ్ కార్మికులను అవమానించారని నిరసన
  • జగిత్యాల సీఐ ప్రకాశ్‌కు ఫిర్యాదు
  • నాగబాబు, రోజా, రష్మిలపై చర్య తీసుకోవాలి
'జబర్దస్త్' కార్యక్రమంలో గల్ఫ్ కార్మికులను, వారి కుటుంబ సభ్యులను, మహిళలను అవమానపరిచే విధంగా నటిస్తూ అసభ్యకరమైన పదజాలంతో స్కిట్ చేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ గల్ఫ్, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

ఆ స్కిట్ చేసిన జబర్దస్త్ కమెడియన్లు అవినాష్, కార్తీక్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఈటీవీ, మల్లెమాల ప్రొడక్షన్‌పై చర్యలు తీసుకోవాలని జగిత్యాల టౌన్‌ సీఐ ప్రకాశ్‌కు తెలంగాణ గల్ఫ్‌ కార్మిక సంఘాలు ఫిర్యాదు చేశాయి. జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా, యాంకర్ రష్మిలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
jabardast Programme
Avinash
Karthik
Nagababu
Roja
Anchor Rashmi

More Telugu News