Pawan Kalyan: అందుకే, ఈ కవాతు చేశాం: పవన్ కల్యాణ్

  • దోపిడీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే ఈ కవాతు
  • రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయింది
  • దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమసింహాలు మా సైనికులు

తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ పై జనసేన’ కవాతు ముగిసింది. ధవళేశ్వరం సమీపంలోని బహిరంగ సభా వేదిక వద్దకు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'లక్షలాదిగా తరలి వచ్చిన జనసేన సైనికులు.. కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు.. దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమసింహాలు' అని అన్నారు.

‘కవాతు ఎవరు చేస్తారు? మిలిటరీ సైనికులు. సామాన్య ప్రజలు కవాతు చేయరు. మరి, మనం ఎందుకు కవాతు చేయాల్సి వచ్చింది?’ అని ప్రశ్నించారు. అవినీతిని, దోపిడీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే ఈ కవాతు చేయాల్సి వచ్చిందని అన్నారు. రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయిందని, అవినీతితో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. నిరుద్యోగ సమస్యతో యువకులు రగిలిపోతున్నారని విమర్శిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

More Telugu News