Andhra Pradesh: తిత్లీ విధ్వంసం.. నష్ట పరిహారం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!

  • జిల్లాలో పర్యటించిన మంత్రి కళా వెంకట్రావు
  • రంగంలోకి 40 మంది కలెక్టర్లు, 120 మంది డిప్యూటీ కలెక్టర్లు
  • పంటలకు పరిహారం ప్రకటించిన మంత్రి

తిత్లీ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలో శరవేగంగా సహాయక చర్యలను చేపడుతున్నామని మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 40 మంది ఐఏఎస్ అధికారులు, 120 మంది డిప్యూటీ కలెక్టర్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో ఆయన పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ పునరుద్ధరణ కోసం 37,000 స్తంభాలు తెప్పించామని వెల్లడించారు.

తుపాను కారణంగా నేలకొరిగిన ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,200, ఎకరా జీడి మామిడికి రూ.8,000 ఇస్తామన్నారు. అలాగే అరటి పంట హెక్టారుకు రూ.25,000, కూరగాయల పంటకు హెక్టారుకు రూ.15,000 అందజేస్తామని కళా వెంకట్రావు అన్నారు. అంతేకాకుండా వరద కారణంగా దెబ్బతిన్న చిన్న పడవలకు పూర్తి రాయితీ ఇస్తామనీ, పెద్ద పడవలకు మాత్రం 50 శాతం రాయితీని అందజేస్తున్నామని పేర్కొన్నారు.

మరోవైపు ఈ రోజు మందసలో పర్యటించిన మంత్రి నారా లోకేశ్.. సాయంత్రం కల్లా చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. ప్రజలు అధైర్య పడొద్దని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రజలకు నిత్యావసరాలను త్వరితగతిన అందజేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News