sai dharamtej: మెగా హీరో కొత్త సినిమా ప్రారంభం!

  • సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా కొత్త చిత్రం
  • పరిశీలనలో 'చిత్ర లహరి' టైటిల్
  • సాయి ధరమ్ తేజ్ కి ఇది 11వ చిత్రం

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నూతన చిత్రం కాసేపటి క్రితం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. సాయి ధరమ్ తేజ్11వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'చిత్ర లహరి' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ వేడుకకు దర్శకుడు కొరటాల శివ ముఖ్య అతిధిగా హాజరయ్యి క్లాప్ నిచ్చారు. 'రంగస్థలం, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలని అందించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్న ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్నాడు.

More Telugu News