Araku: ఎమ్మెల్యే కిడారి, సివేరి హత్యకేసులో నలుగురి అరెస్ట్!

  • ఎప్పటికప్పుడు సమాచారం అందించారు
  • ఉనికి కోసమే జంట హత్యలు
  • నిఘా పెట్టి హత్య చేశారు

ఇటీవల అరకులో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు శోభన్, సుబ్బారావు, ఈశ్వరి, కొర్ర కమలును పోలీసులు అరెస్ట్ చేశారు. తాము మావోయిస్టులకు కిడారి, సివేరి సోమల సమాచారాన్ని అందించినట్టు నిందితులు అంగీకరించారు.

ఈ సందర్భంగా సిట్ అధికారి ఫకీరప్ప మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులు ఉనికి కోసమే జంటహత్యలు చేశారన్నారు. సర్రయి గ్రామంలో గ్రామ దర్శిని కార్యక్రమం ఉందని మావోయిస్టులకు నిందితులు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల కదలికలపై నిందితులు ఎప్పటికప్పుడు మావోయిస్టులకు సమాచారం చేరవేశారని ఫకీరప్ప తెలిపారు. కిడారి, సివేరిలపై నిఘా పెట్టి మావోయిస్టులు హత్య చేశారని ఫకీరప్ప తెలిపారు.

More Telugu News