Chandrababu: నా 'చంద్రబాబు' దొరికేశాడు... చెప్పినట్టుగా లక్ష ఇస్తున్నా: రామ్ గోపాల్ వర్మ

  • నిన్న వీడియోను పోస్టు చేసిన వర్మ
  • చంద్రబాబులా కనిపిస్తున్న ఓ వ్యక్తి
  • అతని ఆచూకీ తెలిసిందని చెప్పిన వర్మ
తాను నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో చంద్రబాబు పాత్రను పోషించే వ్యక్తి దొరికేశాడని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. నిన్న ఓ చిన్న వీడియోను పోస్టు చేస్తూ, అందులో అచ్చం చంద్రబాబులా కనిపిస్తున్న ఓ హోటల్ వెయిటర్ ను చూపించిన వర్మ, అతను ఎవరో తెలిస్తే చెప్పాలని, అతనికి రూ. లక్ష ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీవీ-9లో పనిచేస్తున్న ముత్యాల రోహిత్ అనే యువకుడు, అతని ఆచూకీపై వర్మకు సమాచారం అందించాడట. ఇక అదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో తెలిపిన వర్మ, రోహిత్ కు కృతజ్ఞతలు తెలిపాడు. సినిమా ప్రారంభంలో అతని పేరును తెరపై వేస్తామని, వెంటనే బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయాలని, ఆ వెంటనే తాను ప్రకటించిన లక్ష రూపాయలను పంపుతానని చెప్పాడు.
Chandrababu
Ramgopal Varma
Lakshmis NTR

More Telugu News