ఆయన 'గడ్డం కుమార్ రెడ్డి'గానే ఉండాల్సి వస్తుంది: నాయిని సెటైర్లు

- ఇకపై ఉత్తమ్ ఎప్పటికీ గడ్డంతోనే ఉంటాడు
- తెలంగాణ పోలీసులపై ఉత్తమ్ ఆరోపణలు తగదు
- త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం
తెలంగాణ పోలీసులపై లేనిపోని ఆరోపణలు ఉత్తమ్ చేస్తున్నారని, దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ పోలీస్ అని కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పోలీసులు వాళ్ల పని వారు చేసుకుపోతున్నారని, అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేయొద్దని ఉత్తమ్ కు హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చాక, అధికారుల పని పడతామని ఉత్తమ్ అంటున్నారని, వాళ్లను బెదిరించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని.. అది సాధ్యమయ్యే పని కాదని హెచ్చరించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని, ప్రజలకు కేసీఆర్ అందించిన పాలన, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.