Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా 8 మంది మృతి

  • కారు, ట్రక్కు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం
  • కారులో పిక్నిక్‌‌కు వెళ్లిన ఉపాధ్యాయులు, విద్యార్థులు
  • మృతుల్లో పాఠశాల యజమాని
రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా 8 మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నేటి ఉదయం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలోని ఓ పాఠశాలకు చెందిన కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు సాలుంబార్ ప్రాంతానికి కారులో పిక్నిక్‌‌కు బయలుదేరారు. ఖైరాద్ ప్రాంతం సమీపంలో కారు.. ట్రక్కును ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో పాఠశాల యజమాని కూడా ఉన్నట్లు సమాచారం. ఇద్దరు విద్యార్థులు, ఒక టీచర్‌ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident
Rajasthan
Udaypur
Teachers
Students

More Telugu News