ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యూజర్లు తమ మొబైల్ నెంబర్లు వెంటనే రిజిస్టర్ చేయించుకోవాలి: ఎస్బీఐ ప్రకటన
- లేనిపక్షంలో డిసెంబర్ 1 నుంచి సేవలు నిలిపివేస్తాం
- ఇచ్చిన గడువులోగా రిజిస్టర్ చేయించుకోవాలి
- ఎస్బీఐ వెబ్ సైట్ లో పొందుపరిచిన వివరాలు
ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్బీఐ వెబ్ సైట్ లో పొందుపరిచింది. కాగా, ఖాతాదారుల బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ అలర్ట్ ల ద్వారా యూజర్లకు తప్పనిసరిగా తెలియజేయాలని ఆర్బీఐ గత ఏడాదిలో అన్ని బ్యాంకులకు సర్క్యులర్ జారీ చేసింది. ఇందులో భాగంగానే ఎస్బీఐ తాజాగా ఈ ప్రకటన చేసింది.