cyclone: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పల్సర్ బైక్ పై తిరిగిన నారా లోకేష్

  • శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను వణికించిన తిత్లీ తుపాను
  • ఉద్ధానం ప్రాంతాన్ని పరిశీలించిన నారా లోకేష్
  • బాధితుల్లో భరోసాను నింపే ప్రయత్నం చేసిన వైనం

తిత్లీ తుపాను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను వణికించిన సంగతి తెలిసిందే. తుపాను ధాటికి పలువురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన చంద్రబాబు... పలాసలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఉద్ధానం ప్రాంతంలో ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలసి పల్సర్ బైక్ పై తిరుగుతూ పరిశీలించారు. మధ్యమధ్యలో బాధితులను కలుస్తూ, వారికి భరోసాను కల్పిస్తూ ముందుకుసాగారు.

  • Loading...

More Telugu News