అప్పుడు ముద్దాయిలు అన్నవారితోనే ఇప్పుడు చంద్రబాబు తిరుగుతున్నారు: కన్నా
- ఐటీ దాడులకు టీడీపీ ఎందుకు భయపడుతోంది?
- అవినీతిపరులకు మద్దతిస్తున్న చంద్రబాబు రాజీనామా చేయాలి
- రాష్ట్ర అభివృద్ధిని పలు పార్టీలు అడ్డుకుంటున్నాయి
అవినీతిపరులను అంతమొందించాలని డిమాండ్ చేసిన టీడీపీ... ఇప్పుడు ఐటీ దాడులకు ఎందుకు భయపడుతోందని కన్నా ప్రశ్నించారు. ఐటీ అధికారులు వాళ్ల పని వాళ్లు చేసుకుని వెళుతున్నారని చెప్పారు. ఐటీ దాడులను కూడా రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అవినీతిపరులకు మద్దతిస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.