కిడారి, సోమల హత్యలో పాల్గొన్న మావోయిస్టు మీనా ఎన్ కౌంటర్!
- ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఘటన
- నలుగురిని అదుపులోకి తీసుకున్న బలగాలు
- విశాఖ మన్యంలో ఇద్దరిని హతమార్చిన మావోలు
ఈ సందర్భంగా మావోలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన బలగాలు కాల్పులు జరపడంతో మీనా ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన మీనాను గాజర్ల రవి అలియాస్ గణేశ్ భార్యగా పోలీసులు గుర్తించారు. ఆమె స్వస్థలం వరంగల్ అని చెప్పారు. కాగా, ఈ ఎన్ కౌంటర్ లో జయంతి, రాధిక, గీత, రాజశేఖర్ అనే మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.