Singer: నా ముందే చిన్మయిని గదిలోకి రమ్మన్నారు: తల్లి పద్మాసిని

  • లైంగిక వేధింపులపై స్పందించిన పద్మాసిని
  • 2004లో స్విట్జర్లాండ్ లో వైరముత్తు వేధించాడు
  • రహస్యంగా కలవడం ఎందుకంటే కాస్తంత సహకరించమన్నారు
  • వేరేవాళ్లను చూసుకోండని చెప్పి వచ్చేశామన్న పద్మాసిని

తన కుమార్తె చిన్మయి సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఆమె తల్లి పద్మాసిని తొలిసారి స్పందించారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, తన ముందే తన కూతురిని వైరముత్తు గదిలోకి పిలిచాడని ఆరోపించారు. 2004లో జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ, తాము ఓ చిత్రం ఆడియో ఫంక్షన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లామని, కార్యక్రమం ముగిసిన తరువాత అందరినీ పంపించిన నిర్వాహకులు తమను మాత్రం అక్కడే ఉంచారని చెప్పారు. తమ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి, చిన్మయి కోసం వైరముత్తు గదిలో వేచిచూస్తున్నాడని, ఆమెను లోపలికి రమ్మంటున్నారని, తనను మాత్రం అక్కడే వెయిట్ చేయాలని చెప్పాడని పద్మాసిని తెలిపారు.

'ఎందుకీ రహస్య కలయిక?' అని తాను ప్రశ్నించగా, 'వైరముత్తుకు కాస్తంత సహకరించండి' అన్న విషయాన్ని బహిరంగంగానే చెప్పాడని, 'ఆ పనికైతే వేరేవారిని చూసుకోండి' అని చెప్పి తాము బయటకు వచ్చేశామని వెల్లడించారు. 'మీటూ' బాధితులు మహా సంఘంగా మారాలని, పాడైపోతున్న సమాజం మారాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.

More Telugu News