Internet: మరో 48 గంటల్లో.. ప్రపంచమంతటా ఆగిపోనున్న ఇంటర్నెట్!

  • ప్రధాన సర్వర్ ను షట్ డౌన్ చేయనున్న ఐసీఏఎన్ఎన్
  • నిలిచిపోనున్న ఇంటర్నెట్ సేవలు
  • వెబ్ పేజీల యాక్సెస్, బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కు ఇబ్బంది కలిగే అవకాశం

నిర్వహణా మరమ్మతుల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలందించే ప్రధాన సర్వర్ ను, దానికి సంబంధించిన కనెక్షన్లను వచ్చే 48 గంటల్లో నిలిపివేయనున్నారని, దీని ఫలితంగా ప్రపంచమంతా ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలుగుతుందని 'రష్యా టుడే' పేర్కొంది. ఐసీఏఎన్ఎన్ (ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌) ఆధ్వర్యంలో ప్రధాన సర్వర్ ఉండగా, సైబర్ దాడుల నుంచి ఇంటర్నెట్ ను మరింత సురక్షితం చేసేందుకు క్రిప్టోగ్రాఫిక్ కీని మార్చాల్సిన వుందని, అందువల్లే కాసేపు సేవలు నిలిచిపోతాయని తెలిపింది. దీనివల్ల ఇంటర్నెట్ అడ్రస్ బుక్, డీఎన్ఎస్ (డొమైనే నేమ్ సిస్టన్) భద్రంగానే ఉంటాయని  ఐసీఏఎన్ఎన్ తెలిపింది.

ఈ మరమ్మతుల కారణంగా నెట్ వర్క్ షట్ డౌన్ అవుతుందని, ఆ సమయంలో వెబ్ పేజీల యాక్సెస్, బ్యాంకు లావాదేవీలకు ఇబ్బందులు తలెత్తవచ్చని కమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ కూడా ప్రకటించింది. అవుట్ డేట్ అయిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సేవలందుకుంటున్న వారిపై అధిక ప్రభావం ఉంటుందని తెలిపింది.

More Telugu News