susheel modi: జైలుకు పోయినా లాలూలో మార్పు రాలేదు: సుశీల్ మోదీ

  • లాలూ కుటుంబానికి 141 ప్లాట్లు, 30 ఫ్లాట్లు, అర డజను ఇళ్లు ఉన్నాయి
  • వీళ్లకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులు లేవు
  • తన పుస్తకం 'బినామీ'లో ప్రస్తావించిన సుశీల్ మోదీ

జైలుకు పోయిన వారిలో పరివర్తన వస్తుందని... కానీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ యాదవ్ విమర్శించారు. పలు కేసుల్లో దోషిగా తేలిన లాలూలో కొంచెం కూడా మార్పు రాలేదని అన్నారు. తన పుస్తకం 'బినామీ' ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ పుస్తకంలో ప్రధానంగా లాలూ, ఆయన కుటుంబసభ్యులను సుశీల్ మోదీ ప్రస్తావించారు.

లాలూ కుటుంబానికి 141 ప్లాట్లు, 30 ఫ్లాట్లు, అర డజను ఇళ్లు ఉన్నాయని సుశీల్ ఆరోపించారు. 29 ఏళ్ల తేజశ్వి యాదవ్ 20 ప్రాపర్టీలకు ఓనర్ ఎలా కాగలిగారని ప్రశ్నించారు. వీళ్లకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులు లేవు... క్రికెటర్ గా తేజశ్వి రాణించింది లేదని అన్నారు. తేజ్ ప్రతాప్ కు 28, మిసా భారతికి 23 ప్రాపర్టీలు ఉన్నాయని తన పుస్తకంలో సుశీల్ పేర్కొన్నారు. లాలూ భార్య రబ్రీదేవికి 43 ప్లాట్లు, 30 ఫ్లాట్లు ఉన్నాయని ఆరోపించారు.

More Telugu News