gaddar: గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం!

  • గద్దర్ ను ఢిల్లీకి తీసుకెళ్లిన మధు యాష్కీ
  • రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న ప్రజా గాయకుడు
  • ఈ వార్తలన్నీ పుకార్లే అంటున్న గద్దర్ సన్నిహితులు
గజ్వేల్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానంటూ ప్రజా గాయకుడు గద్దర్ ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడే ఆయన ఓటు హక్కును కూడా నమోదు చేయించుకున్నారు. తాజాగా, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గద్దర్ ను మాజీ ఎంపీ మధు యాష్కీ ఢిల్లీకి తీసుకెళ్లారని సమాచారం. మరోవైపు, ఈ వార్తల్లో నిజం లేదని గద్దర్ సన్నిహితులు చెబుతున్నారు. ఒక ఫౌండేషన్ కు సంబంధించి రాహుల్ గాంధీకి వినతిపత్రం ఇచ్చేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లారని వారు తెలిపారు.
gaddar
congress
Rahul Gandhi
Madhu Yaskhi

More Telugu News