kcr: చేతకాని కేసీఆర్ ను గద్దె దించే రోజు దగ్గర్లోనే ఉంది: కాంగ్రెస్ నేత విజయశాంతి

  • వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటమి తప్పదు
  • ఉద్యమం నాటి కేసీఆర్ వేరు..సీఎం కేసీఆర్ వేరు
  • కేసీఆర్ వద్ద చాలా డబ్బుంది
చేతకాని కేసీఆర్ ను గద్దె దించే రోజు దగ్గర్లోనే ఉందని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి జోస్యం చెప్పారు. మహబూబ్ నగర్ క్రాస్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్ర ఈరోజు నిర్వహించింది. ఈ ప్రచార యాత్రలో పాల్గొన్న విజయశాంతి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటమి తప్పదని, ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు.

తెలంగాణ ఉద్యమం నాటి కేసీఆర్ వేరు, ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ వేరని విమర్శించారు. ఎంతో మంది ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, కేసీఆర్ ను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే, వారిని మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ వద్ద చాలా డబ్బు ఉందని, ఆ డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. వారిచ్చే డబ్బు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని విజయశాంతి పిలుపు నిచ్చారు.
kcr
vijayashanthi
mahabubnagar

More Telugu News