vaijayanthi movies: ఆ వార్తలో ఎంతమాత్రం నిజం లేదు: వైజయంతీ మూవీస్

  • చిరంజీవితో హిట్ మూవీస్ చేశాము 
  • మరో సినిమా చేసే ఛాన్స్ వస్తే సంతోషమే 
  • అదే జరిగితే సగర్వంగా చెబుతాం  

ఇటీవల 'మహానటి'తో గొప్ప విజయాన్ని అందుకున్న వైజయంతీ మూవీస్ ను చిరంజీవి ఎంతగానో అభినందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ ను ఆయన ఎంతగానో అభినందించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కోసం నాగ్ అశ్విన్ ఒక కథను సిద్ధం చేస్తున్నాడనీ, ఆ కథ పూర్తయిన తరువాత నిజంగానే అది ఆయనకి తగినట్టుగా ఉందని అనిపిస్తే అప్పుడు ఆ ప్రాజెక్టును గురించి ఆలోచిస్తామని అశ్వనీదత్ అన్నారు.

ఆ మాట పట్టుకున్నారేమో .. వైజయంతీ మూవీస్ తదుపరి సినిమా చిరంజీవితోననే ప్రచారం జరుగుతోంది. దాంతో ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేననీ, అందులో నిజం లేదని వైజయంతీ మూవీస్ వారు అధికారికంగా తెలియజేశారు. 'ఇంతవరకూ మేం చిరంజీవితో 4 బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాము. అయిదవ సినిమా చేసే అవకాశం వస్తే ఎంతో సంతోషిస్తాం. అలాంటి ఛాన్స్ వస్తే మేమే సగర్వంగా ఆ విషయాన్ని తెలియజేస్తాము" అని చెప్పుకొచ్చారు.   

More Telugu News