VH: వీహెచ్ బస్సు యాత్ర.. అడ్డుకున్న ఎన్నికల అధికారులు!

  • హైదరాబాద్ లోని గన్ పార్క్ లో ఘటన
  • అనుమతి లేకుండా యాత్ర చేపట్టడంపై అభ్యంతరం
  • ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టీకరణ
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తలపెట్టిన బస్సు యాత్రను అధికారులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లోని గన్ పార్క్ నుంచి వీహెచ్ యాత్రను ప్రారంభించేందుకు యత్నించగా, నాంపల్లి ఏరియా అసిస్టెంట్ రిట్నరింగ్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతులు తీసుకున్నాకే యాత్రను ప్రారంభించాలని సూచించారు.

ఈ నేపథ్యంలో తన ప్రతినిధిని వీహెచ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ప్రారంభించినందునే వీహెచ్ యాత్రను అడ్డుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ యాత్ర అనుమతులకు సంబంధించి వీహెచ్ సరైన పత్రాలు చూపలేదన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరు ఎలాంటి యాత్ర చేపట్టినా ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు.
VH
Telangana
Congress
bus yatra
election commission
returning officer

More Telugu News