kaushal: కౌశల్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయా .. ఆ బాధ్యత ఆయనపైనే వుంది: సామ్రాట్

  • కౌశల్ ఆర్మీ ట్రోలింగ్ ఇబ్బంది పెడుతోంది 
  • అభిమానానికి ఒక పరిమితి ఉంటుంది 
  • ట్రోలింగ్ ఆగేలా కౌశల్ చూడాలి

బిగ్ బాస్ హౌస్ లో టాస్కుల పరంగా కౌశల్ తో గొడవపడినవారిలో తనీష్ .. గీతామాధురి తరువాత ప్లేస్ లో సామ్రాట్ కనిపిస్తాడు. ఈ షో ముగింపు దశకి చేరుకుంటూ ఉండగా, కౌశల్ .. సామ్రాట్ మధ్య గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి. ఫైనలిస్టుల జాబితాలోకి ముందుగా చేరిన సామ్రాట్ .. ముందుగానే హౌస్ లో నుంచి బయటికి వచ్చేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'కౌశల్ ఆర్మీ' గురించి ప్రస్తావించాడు.

"కౌశల్ ఆర్మీ ట్రోలింగ్ వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ట్రోల్ చేయడం దారుణం. కౌశల్ పట్ల మీకు గల అభిమానాన్ని చూపించడానికి ఇతరులను టార్గెట్ చేయడం భావ్యం కాదు. అభిమానులు ఉండటం అందరికీ ముఖ్యమే .. అయితే ఆ అభిమానానికి ఒక పరిమితి ఉంటుంది. షో నుంచి బయటికి వచ్చిన తరువాత కౌశల్ కి గల ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అభిమానుల చర్యలను నియంత్రించి, ట్రోలింగ్ ఆగేలా చూసే బాధ్యత కౌశల్ పైనే వుంది" అని చెప్పుకొచ్చాడు.   

More Telugu News