balakrishna: శ్రీదేవిగా కనిపించేందుకు రకుల్ కి ముట్టింది కోటి రూపాయలట!

  • శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ 
  • పాత్ర నిడివి 20 నిమిషాల లోపు
  • రకుల్ లుక్ పట్ల అసంతృప్తి

నందమూరి అభిమానులంతా ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపించనుంది. ఎన్టీఆర్ .. శ్రీదేవి కాంబినేషన్లో  హిట్ సినిమాలు వచ్చాయి. అందువలన 'ఎన్టీఆర్ కథానాయకుడు'లో శ్రీదేవి పాత్ర కనిపించనుంది. మొత్తం మీద రకుల్ పాత్ర నిడివి ఒక 20 నిమిషాల లోపు ఉండవచ్చని అంటున్నారు.

ఈ పాత్ర నిమిత్తం పారితోషికంగా రకుల్ కి కోటి రూపాయలు ముట్టినట్టుగా తెలుస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో రకుల్ కి మంచి క్రేజ్ వుంది. ప్రస్తుతం ఆమె హిందీ సినిమాలు కూడా చేస్తోంది. ఈ కారణంగానే ఆమెకి ఈ స్థాయి పారితోషికం ఇచ్చినట్టుగా సమాచారం. ఇదిలా ఉంచితే, శ్రీదేవిగా రకుల్ లుక్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. నటన పరంగా .. పాటల్లో డాన్స్ పరంగా శ్రీదేవిని రకుల్ గుర్తుకు తెస్తుందేమో చూడాలి. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.   

More Telugu News