Jolly LLB: భార్య ముందే బాలీవుడ్ దర్శకుడి చెంపపై లాగి ఒకటిచ్చి... వీడియో షేర్ చేసిన హీరోయిన్ గీతికా త్యాగి!

  • 'జాలీ ఎల్ఎల్బీ' దర్శకుడు సుభాష్ కపూర్
  • లైంగికంగా వేధించాడని ఆరోపించిన గీతికా త్యాగి
  • భార్యను కూర్చోబెట్టి, ఆమె ముందే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన నటి

తనను లైంగికంగా వేధించిన 'జాలీ ఎల్ఎల్బీ' దర్శకుడు సుభాష్ కపూర్ ను చెంపపై లాగి ఒకటిచ్చిన నటి గీతికా త్యాగి, అందుకు సంబంధించిన వీడియోను పంచుకుంది. బాలీవుడ్‌లో మంచి పేరున్న సుభాష్ అసలు స్వరూపం ఇదేనని చెబుతూ, సుభాష్, అతని భార్య డింపుల్ తో మాట్లాడిన మాటల వీడియోను పోస్ట్ చేసింది.

ఏడుస్తున్న తన భార్యతో అసలేమీ జరగలేదని సుభాష్ సంజాయిషీ ఇచ్చుకుంటుండగా, సుభాష్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపిస్తూ, ఆమె ముందే అతని చెంపపై కొట్టింది గీతిక. వాస్తవానికి గీతిక పోస్టు చేసిన వీడియోలో, సుభాష్ ను తిడుతున్నట్టు మాత్రమే కనిపిస్తున్నప్పటికీ, అక్కడి సీసీ కెమెరాల్లో ఆమె కొడుతున్న దృశ్యం రికార్డు అయి బయటకు వచ్చింది.

ఇప్పుడు ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వచ్చిన 'ఆత్మ' చిత్రంలో గీతిక నటించిన సంగతి తెలిసిందే. గీతిక ఆరోపణలు, సుభాష్ భార్య డింపుల్ వ్యాఖ్యలు, సంజాయిషీ ఇస్తున్న సుభాష్ మాటల వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News