టీడీపీ ఎప్పటి నుంచో చెబుతోంది.. ఇప్పుడు నిజమని తేలింది: డొక్కా

11-10-2018 Thu 08:22
  • వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామా అని అప్పుడే చెప్పాం
  • ఎన్నికల సంఘం ఇప్పుడా విషయాన్ని స్పష్టం చేసింది
  • రాజీనామాలు చేసి ఏం సాధించారో జగన్ చెప్పాలి
వైసీపీ ఎంపీల రాజీనామాల విషయంలో టీడీపీ మొదటి నుంచి చెబుతున్నది ఇప్పుడు నిజమని తేలిందని ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసమే తమ పదవులకు రాజీనామా చేశామంటూ వైసీపీ ఎంపీలు ప్రగల్భాలు పలికారని, ఎన్నికల సంఘం వారి గుట్టును రట్టు చేసిందని అన్నారు.

ఎంపీల రాజీనామాలు డ్రామా అనే విషయాన్ని తాము ఎప్పుడో చెప్పామని, వారు రాజీనామా చేసిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల కమిషన్ చెప్పడంతో వారిది డ్రామా అని తేలిపోయిందన్నారు. రాజీనామాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని తామెప్పుడో చెప్పామని, ఇప్పుడది నిజమైందని డొక్కా పేర్కొన్నారు. అసలు వారెందుకు రాజీనామా చేశారో, చేసి ఏం సాధించారో ఆ పార్టీ అధినేత జగన్ చెప్పాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు.