Chandrababu: మనం అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుంది: సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
మనం అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని గరుడాపురంలో చంద్రబాబు పర్యటించారు. గరుడాపురంలో సమీపంలోని కుందుర్పి కాల్వకు భూమిపూజ చేశారు.

అనంతరం, బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ, నేడు ప్రారంభించింది మహాయజ్ఞమని, ఈ యజ్ఞం పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని అన్నారు. కేంద్రప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని, వీళ్లు చేస్తున్న మోసాన్ని గ్రహించి ఎన్డీఏ నుంచి బయటకొచ్చామని అన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధాన పనులు చేపడుతున్నామని, భవిష్యత్తులో ఐదు నదులను అనుసంధానించి మహాసంగమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. నదుల అనుసంధానం చేసి నీటి ఎద్దడి లేకుండా చేస్తామని చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh

More Telugu News