bahrani: బహ్రెయిన్ లో అగ్నిప్రమాదం.. సీఎం చంద్రబాబు ఆరా

  • ఓ బిల్డింగ్ లోని రెండో అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలుడు
  • పేలుడు ధాటికి భవనం నేలమట్టం  
  • నలుగురు మృతి..ఇరవై మందికి పైగా గాయాలు
బహ్రెయిన్ దేశంలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా, సుమారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు. ఓ బిల్డింగ్ లోని రెండో అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలి ఈ దుర్ఘటన జరిగింది. పేలుడు ధాటికి భవనం నేలమట్టమైంది. ఈ సమాచారం మేరకు సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించాయి. భవన శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోననే అనుమానంతో తక్షణ చర్యలు ప్రారంభించాయి.

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీశారు. మృతుల్లో తెలుగువారు ఉన్నారంటూ వెలువడుతున్న మీడియా కథనాల నేపథ్యంలో ఏపీ భవన్ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు.  ఈ విషయమై బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించానని, మృతులందరూ బంగ్లాదేశ్ కు చెందిన వారేనని రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఒకవేళ తెలుగువారు బాధితులుగా ఉంటే వెంటనే వారిని ఆదుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
bahrani
gas sylinder explosion

More Telugu News