love failure: ప్రేమకు నో చెప్పిన యువకుడు.. చెల్లితో కలిసి ప్రాణాలు తీసుకున్న అక్క!

  • చిత్తూరు జిల్లాలోని కలికిరిలో ఘటన
  • ఓ యువకుడిని ప్రేమించిన తస్లీమ్
  • ఒప్పుకోకపోవడంతో బలవన్మరణం
తాను ప్రేమించిన యువకుడు నో చెప్పడంతో ఓ యువతి మనస్తాపానికి లోనయింది. చనిపోవాలని నిర్ణయించుకుంది. అయితే తాను లేకుండా చెల్లెలు బతకలేదని భావించిన యువతి తన ప్రేమ విఫలమయిన విషయాన్ని చెల్లికి చెప్పింది. అనంతరం ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని కలికిరి పట్టణంలో చోటుచేసుకుంది.

  కలికిరి పట్టణానికి చెందిన అక్కాచెల్లెళ్లు తస్లీమ్, షికాబీ ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుతున్నారు. గత కొంత కాలంగా తస్లీమ్ ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అయితే అతను ప్రేమను నిరాకరించడంతో మనస్తాపానికి లోనైంది. ఈ విషయాన్ని ఆమె చెల్లి షికాబీకి చెప్పింది. దీంతో ఇద్దరు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బ్రతుకుదెరువు కోసం కువైట్ కు వెళ్లిన తండ్రి అజంతుల్లా కుమార్తెల అంత్యక్రియలకు రాలేకపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఇటీవలే కువైట్ కు వెళ్లడంతో తిరిగిరావడం వీలుకాలేదని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, విచారణ జరుపుతున్నామని కలికిరి ఎస్సై శ్రీనివాసులు పేర్కొన్నారు. గతంలో ఇంటర్ చదువుతున్న సమయంలో అభిప్రాయభేదం రావడంతో వీరిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారన్నారు. అక్కాచెల్లెళ్లు ఎంతో అనోన్యంగా ఉండేవారన్నారు.
love failure
suicide
Chittoor District
Andhra Pradesh
kalikiri
sisters

More Telugu News