Cricket: 15 నుంచి విశాఖ 'డే అండ్‌ నైట్‌' వన్డే మ్యాచ్‌ టికెట్ల అమ్మకం

  • స్టేడియం సామర్థ్యం 28 వేలు
  • 90 శాతం టికెట్లు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా అమ్మకం
  • ఈవెంట్స్‌ నౌ డాట్‌ కామ్‌, విశాఖలోని 10 కేంద్రాల ద్వారాల విక్రయం

వెస్టిండిస్‌తో జరగనున్న రెండో డే అండ్‌ నైట్‌ వన్డేకు టికెట్ల విక్రయం ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. విశాఖలోని పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనె 24న ఈ మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. స్టేడియం సామర్థ్యం 28 వేలు కాగా, ఇందులో 90 శాతం టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్వాహక కమిటీ చైర్మన్‌, పోర్టు ట్రస్టు చైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు విలేకరులకు తెలిపారు.

ఈవెంట్స్‌ నౌ డాట్‌ కామ్‌ ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాన్ని చేపట్టనుంది. దీంతో పాటు విశాఖలోని పది కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. టికెట్ల కొనుగోలుకు ఎటువంటి ఆధార్‌ లింక్‌ అవసరం లేదన్నారు. 250, 500, 750, 1200, 1800, 2 వేల రూపాయ డినామినేషన్ల టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. గతంలో బాక్స్‌ టికెట్‌ను 2500 రూపాయలకు విక్రయించగా ఈసారి దీని ధరను రూ.500 తగ్గించి రూ.2 వేలు చేశారు.  కాగా, ఈ నెల 22వ తేదీన ఇరు జట్ల క్రీడాకారులు విశాఖకు చేరుకుంటారు. 23వ తేదీన నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తారు. 24వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

More Telugu News