junior ntr: ‘యంగ్ టైగర్’ కళ్లల్లోని ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను: యాంకర్ గాయత్రి భార్గవి

  • హరికృష్ణ పెన్సిల్ స్కెచ్ ను మా తాతయ్య గీశారు
  • ఈ స్కెచ్ ను తారక్ కు అందజేశా
  • యంగ్ టైగర్ ఆనందం అంతాఇంతా కాదు

త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘అరవింద సమేత వీరరాఘవ’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ని ప్రముఖ యాంకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాయత్రి భార్గవి ఇంటర్వ్యూ చేశారు.

ఈ సందర్భంగా తారక్ కు ఆమె ఓ అపురూపమైన కానుకను అందజేశారు. ఆమె తాత శంకర్ నారాయణ గీసిన నందమూరి హరికృష్ణ పెన్సిల్ స్కెచ్ ను జూనియర్ కు అందజేశారు. ఈ విషయాన్ని గాయత్రి భార్గవి తన ట్వీట్ ద్వారా తెలిపింది. తన తాతయ్య శంకర్ నారాయణ గీసిన నందమూరి హరికృష్ణ పెన్సిల్ స్కెచ్ ను తారక్ కు ఇచ్చానని, దీనిని అందుకున్న యంగ్ టైగర్ కళ్లల్లో ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పింది. ఈ పెన్సిల్ స్కెచ్ ను అందుకున్న యంగ్ టైగర్.. ‘అమ్మకు ఇస్తానండి.. థ్యాంక్యూ’ అని చెప్పాడని గాయత్రి భార్గవి పేర్కొంది. 

More Telugu News