sasha chettri: 'సాహో' సినిమాలో ఎయిర్ టెల్ 4జీ అమ్మాయి?

  • యూత్ మనసు దోచేసిన ఎయిర్ టెల్ అమ్మాయి 
  • వరుసగా వస్తోన్న సినిమా అవకాశాలు
  • ఆల్రెడీ ఆమె చేతిలో ఒక తెలుగు సినిమా  

ఎయిర్ టెల్ 4జీ యాడ్స్ లో కనిపించే అమ్మాయి అనగానే మెరుపుతీగలాంటి ఒక రూపం కళ్లముందు కదలాడుతుంది. కాకపోతే ఆ అమ్మాయి పేరు 'సాషా చెత్రీ' అనే విషయం అందరికీ తెలిసుండకపోవచ్చు. ఎయిర్ టెల్ యాడ్స్ లో కనిపించే ఆ అమ్మాయి నవ్వు .. ఆమె కళ్లలోని మెరుపు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. అలాంటి ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వివిధ భాషల నుంచి సినిమా ఛాన్సులు వస్తున్నాయి.

ఆల్రెడీ ఈ అమ్మాయికి తెలుగులో ఒక అవకాశం దక్కేసింది. అడవి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తోన్న ఒక సినిమాలో ఈ అమ్మాయి నటిస్తోంది. ఇక రెండవ ఛాన్స్ ను ఏకంగా 'సాహో' లోనే కొట్టేసింది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను ఈ అమ్మాయి అయితే బాగుంటుందని భావించి సంప్రదించారట. ప్రభాస్ మూవీ అనగానే ఈ అమ్మాయి వెంటనే ఓకే చెప్పేసిందని అంటున్నారు. బహు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనుండటం వలన, ఈ అమ్మాయి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టీమ్ భావిస్తున్నట్టుగా సమాచారం.  

More Telugu News