jaish-e-mohammad: జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ కు తీవ్ర అనారోగ్యం!

  • కొన్ని రోజులుగా మంచానికే పరిమితమైన మసూద్
  • వెన్నెముక, మూత్రపిండాల సంబంధిత సమస్యలు 
  • రావల్పిండిలోని ఓ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స

భారత్ లో ఎన్నో ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో  గత కొన్ని రోజులుగా తను మంచానికే పరిమితమైనట్టు భారత నిఘా వర్గాల సమాచారం. వెన్నెముక, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో మసూద్ బాధపడుతున్నాడని, రావల్పిండిలోని ఓ మిలిటరీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని సమాచారం.

 మసూద్ స్వగ్రామమైన భవల్ పూర్ లో గానీ, పాకిస్థాన్ లోని ఇతర ప్రాంతాల్లో గానీ ఆయన ఇటీవలి కాలంలో కనపడలేదని తెలుస్తోంది. సుమారు ఏడాదిన్నర కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, మంచానికే పరిమితమయ్యాడట. దీంతో, భారత్, ఆఫ్ఘనిస్థాన్ లలో జిహాదీ దాడుల వ్యవహారాలను మసూద్ సోదరులు రాఫ్ అస్గర్, అత్తర్ ఇబ్రహీం చూసుకుంటున్నారని సమాచారం.

More Telugu News