rajababu: అలా శ్రీశ్రీగారి మరదలినే రాజబాబు పెళ్లి చేసుకున్నాడు: చిట్టిబాబు

  • డబ్బింగ్ సినిమాలు శ్రీశ్రీ రాసేవారు 
  • డబ్బుల కోసం అన్నయ్య డబ్బింగ్ చెప్పాడు 
  • ఆ సమయంలో వాళ్ల పరిచయం జరిగింది

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో చిట్టిబాబు మాట్లాడుతూ, రాజబాబు పెళ్లికి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు. "రాజబాబు కొత్తగా ఇండస్ట్రీకి వెళ్లాడు .. వేషాలు ఇంకా వేయలేదు. అప్పుడు శ్రీశ్రీ డబ్బింగ్ సినిమాలకి రాసేవారు. డబ్బింగ్ చెప్పి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో శ్రీశ్రీ ఇంటికి వెళ్లాడు. అలా రెండుమూడు సార్లు తిరిగి మొత్తానికి ఒక అవకాశం సంపాదించాడు.

డబ్బింగ్ కొత్త కావడంతో కొంత కంగారు పడినా .. ఆ తరువాత అలవాటు పడిపోయాడు. అలా డబ్బింగులు చెబుతూ ఉండటంతో శ్రీశ్రీగారితో పరిచయం ఏర్పడింది. దాంతో తరచూ శ్రీశ్రీగారి ఇంటికి వెళుతూ ఉండేవాడు. శ్రీశ్రీగారి భార్య సరోజిని గారికి ఒక చెల్లెలు వుండేది. ఓ రోజున సరోజినీ గారితో "నాకు మీ చెల్లాయి అంటే ఇష్టమండీ .. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను' అని మనసులోని మాటను బయటపెట్టాడు. అలా ఆమె చెల్లెలితో రాజబాబు వివాహం జరిగిపోయింది" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News