wyra: వైరా నియోజకవర్గం టీఆర్ఎస్ లో ముసలం... అసమ్మతి నేతల భారీ ర్యాలీ!

  • వైరా టీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ పై వ్యతిరేకత
  • నిన్న భారీ ర్యాలీ నిర్వహించిన అసమ్మతి నేతలు
  • ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో టీఆర్ఎస్ లో అసమ్మతి రాగం ఎక్కువవుతోంది. టికెట్ దక్కని నేతలు పార్టీ అధిష్ఠానానికి తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బాణోతు మదన్ లాల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో, ఆ మరుసటి రోజు నుంచే మదన్ లాల్ అభ్యర్థిత్వంపై నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ అసమ్మతి జ్వాలలు ఎగసిపడ్డాయి.

టీఆర్ఎస్ జిల్లా నేత బొర్రా రాజశేఖర్ నేతృత్వంలో నిన్న వైరాలో భారీ ర్యాలీ, సభను నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, మదన్ లాల్ పై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని... ఆయన వల్ల వైరాలో టీఆర్ఎస్ కు పరాభవం తప్పేలా లేదని అన్నారు. ర్యాలీ సందర్భంగా అసమ్మతి నేతలు, మదన్ లాల్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.

  • Loading...

More Telugu News