tirumala: తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ

  • బ్రహ్మోత్సవ ఏర్పాట్లను విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ
  • ఈ సాయంకాలం మట్టిని సేకరించి ఆలయానికి చేరుకోనున్న విష్వక్సేనుడు
  • ఈ మట్టిలో నవధాన్యాలతో బీజావాపం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలు నేడు అంకురార్పణ జరగనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఆయన సేనాధిపతి విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. ఈ వేడుకను వైఖానస ఆగమ మోక్తంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం ఆనవాయతీ.

ఈ సాయంకాలం విష్వక్సేనుడు భూమి పూజతో మట్టిని సేకరించి ఛత్ర చామర మంగళవాయిద్యాలతో ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో మట్టితో నింపిన 9 మూకుళ్లలో నవధాన్యాలతో బీజావాపం చేస్తారు. నిత్యం నీరు పోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

More Telugu News