Rekha nayak: టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్‌ను అడ్డుకున్న సొంత పార్టీ కార్యకర్తలు

  • నాలుగున్నరేళ్లలో రాకుండా ఇప్పుడెందుకు వచ్చారు?
  • ప్రచారానికి వస్తున్నట్టు సమాచారం ఇవ్వరా?
  • ప్రచార రథాన్ని ముందుకు వెళ్లనివ్వని ప్రజలు
ఖానాపూర్‌ మాజీ ఎమ్మెల్యే, తెరాస అభ్యర్థి రేఖానాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంచిర్యాల జిల్లా చెన్నారం మండలంలోని బాదంపల్లికి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆమెను అక్కడి ప్రజలతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అడ్డుకున్నారు. నాలుగున్నరేళ్లలో ఒక్కసారైనా రాని వారు ఇప్పుడెందుకు వచ్చారంటూ గ్రామస్థులు నిలదీశారు.

ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న కొందరు తెరాస కార్యకర్తలు సైతం రేఖానాయక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఊరికి ప్రచారానికి వస్తున్నట్టు సమాచారం ఇవ్వరా? అంటూ ఆమెపై మండిపడ్డారు. దీంతో అసహనానికి గురైన రేఖానాయక్‌ తెరాస పార్టీ ఎవరికీ భయపడదంటూ.. తెరాస ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ప్రచార రథాన్ని ముందుకు పోకుండా ప్రజలు అడ్డుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళన సద్దుమణిగింది.
Rekha nayak
TRS
Khanapur
Mancherial District
Police

More Telugu News