raja singh: హ్యాకింగ్ కు గురైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్ బుక్ ఖాతా

  • కుట్రపూరితంగా హ్యాక్ చేశారన్న రాజాసింగ్
  • ఎంఐఎం నేతల కుట్ర ఉంది
  • నన్ను ఓడించేందుకు అన్ని పార్టీలు యత్నిస్తున్నాయి
బీజేపీ గోషామహల్ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ ను ఆయన కలిశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కావాలనే కుట్రపూరితంగా తన ఫేస్ బుక్ ను హ్యాక్ చేశారని ఆరోపించారు.

తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తనకు 5 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారని చెప్పారు. ఈ నెల 2వ తేదీన హ్యాకింగ్ చేసేందుకు ఒకసారి ప్రయత్నించి విఫలమయ్యారని... నిన్న హ్యాక్ చేశారని మండిపడ్డారు. ఈ ఘటన వెనుక ఎంఐఎం నేతలు ఉన్నారని ఆరోపించారు. గోషామహల్ స్థానంలో తనను ఓడించేందుకు అన్ని పార్టీలు యత్నిస్తున్నాయని... ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాను ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు.

raja singh
bjp
facebook
hack
mim

More Telugu News