coins: మిషన్ భగీరథ తవ్వకాల్లో బయటపడ్డ వెండి నాణేలు

  • మంచిర్యాల జిల్లాలో బయటపడ్డ నాణేలు
  • నాణేలను స్వాధీనం చేసుకున్న అధికారులు 
  • పురావస్తు శాఖకు అప్పగిస్తామని వెల్లడి

మిషన్ భగీరథ పనుల్లో భాగంగా ఓ కూలీ కాలువను తవ్వుతుండగా గడ్డపార పోటుకు ఘల్లు మని శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ఆశ్చర్యపోయిన ఆయన పూర్తిగా తవ్వి చూస్తే వెండి నాణేల కుప్ప కనిపించింది. మొత్తం 338 నాణేలు లభించాయి. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మారావు పేట బెస్తవాడలో ఇది చోటు చేసుకుంది. దొరికిన నాణేలన్నింటినీ మూటగట్టుకుని తన గుడారానికి వెళ్లిపోయాడు సదరు కూలీ.

అయితే మేడి రాజం అనే వ్యక్తికి ఈ విషయం తెలియడంతో ఆ కూలీ ఉన్న గుడారానికి వెళ్లి... ఈ నాణేలు తన భూమిలో దొరికాయంటూ వాటిని లాక్కున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో దేవాపూర్ ఎస్సై దేవయ్య, తహసీల్దార్ ప్రసాద్ వర్మలు పంచనామా నిర్వహించి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని నిజాం కాలం నాటివిగా గుర్తించారు. పురావస్తు శాఖకు వీటిని అప్పగిస్తామని చెప్పారు.

More Telugu News