High Court: టీఎస్ అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో ఎన్ని పిటిషన్లు వేశారో తెలుసా?

  • దాదాపు 200 పిల్స్ వేసినట్టు సమాచారం
  • పిటిషన్లు వేసిన వారిలో నేతలు, రాష్ట్ర ప్రజలు
  • అన్నింటినీ కలిపి హైకోర్టు ఒకేసారి విచారించే అవకాశం

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా పార్టీల నేతలంతా ప్రచారంలో తలమునకలయ్యారు. టీఆర్ఎస్ ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించి, విపక్షాలకు సవాలు విసిరింది. మరోవైపు, అసెంబ్లీని రద్దు చేయడంపై హైకోర్టులో వందలాది ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఈ పిటిషన్లు వేశారు. దాదాపు 200 పిల్స్ వేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, ఈ పిటిషన్లన్నింటినీ కలిపి హైకోర్టు ఒకేసారి విచారించే అవకాశం ఉంది.

More Telugu News