kaushal: 'బిగ్ బాస్ హౌస్'లో ఎవరికి వాళ్లు రిలేషన్స్ పెట్టేసుకున్నారు!: కౌశల్

  • సేఫ్ గేమ్ ఆడటం కోసం అలా చేశారు 
  • నాకు రిలేషన్స్ కంటే గేమ్ ముఖ్యం 
  • బంధాలను కంటిన్యూ చేసే తీరిక నాకు లేదు

'బిగ్ బాస్ హౌస్'లో తన ప్రయాణాన్ని గురించి తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో కౌశల్ ప్రస్తావించాడు. 'బిగ్ బాస్ హౌస్'లోకి అడుగుపెట్టిన తరువాత ప్రతి ఒక్కరూ మిగతావాళ్ల దగ్గరికి వెళ్లి, నువ్వు మా అమ్మవి .. నువ్వు మా అక్కవి .. మా చెల్లెలివి అంటూ రిలేషన్స్ పెట్టేసుకున్నారు. సేఫ్ గేమ్ ఆడటం కోసమే వాళ్లు అలా రిలేషన్స్ పెట్టేసుకున్నారనే విషయం నాకు అర్థమైపోయింది.

ఇలా రిలేషన్ పెట్టుకున్న వాళ్లంతా ఆ సీజన్ మొత్తం కూడా ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోలేదు. ఈ విధమైన రిలేషన్స్ వలన ఒకరిని ఒకరు సమర్థించుకున్నారు గానీ .. 'నువ్వు చేస్తున్నది తప్పు' అని ఎవరికీ ఎవరూ చెప్పలేకపోయారు. నేను రిలేషన్ పెట్టుకోవలసింది వీళ్లతో కాదు .. ప్రేక్షకులతో అనే విషయంలో మొదటి నుంచి నాకు క్లారిటీ వుంది. ఒకవేళ ఇంట్లో వాళ్లతో బంధాలు పెట్టుకుంటే .. బయటికి వచ్చిన తరువాత ఆ బంధాలను కంటిన్యూ చేసే తీరిక కూడా నాకు లేదు. అందువల్లనే నాకు రిలేషన్స్ ముఖ్యం కాదు .. గేమ్ ఇంపార్టెంట్ అని అందరితోనూ చెప్పుకుంటూ వచ్చాను" అని కౌశల్ అన్నాడు.   

  • Loading...

More Telugu News