vijayashanthi: కేసీఆర్ దేవుడిచ్చిన అన్న అని నేను ఎప్పుడూ చెప్పలేదు: విజయశాంతి

  • రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించలేక పోయారు
  • నాలుగేళ్లకే 'కేసీఆర్ వద్దు బాబోయ్' అంటున్నారు
  • కేసీఆర్ అబద్ధాలను ప్రజలు నమ్మరు
తాను కోరుకున్న తెలంగాణ ఇది కాదని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించడం కేసీఆర్ వల్ల కాలేదని... అందుకే ఆయన ఓడిపోవాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. పార్టీ క్యాంపెయినర్ గా రాష్ట్రమంతా పర్యటించాల్సి ఉందని... అందుకే తాను ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నానని చెప్పారు. కేసీఆర్ చెబుతున్న 110 సీట్లు మహాకూటమికి వస్తాయని తెలిపారు. నాలుగు సంవత్సరాల పాలనకే కేసీఆర్ వద్దు బోబోయ్ అని జనాలు అంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెప్పే అబద్ధాలను ఇకపై తెలంగాణ ప్రజలు నమ్మబోరని చెప్పారు. కేసీఆర్ తనకు దేవుడు ఇచ్చిన అన్న అని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. 
vijayashanthi
congress
kcr
TRS

More Telugu News