Election commission: సార్వత్రిక ఎన్నికల సన్నాహాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌: సిద్ధమవుతున్న ఈవీఎంలు

  • ఏర్పాట్లలో ఇప్పటి నుంచే నిమగ్నం
  • వంద శాతం వీవీప్యాట్ లు వినియోగిస్తామని స్పష్టీకరణ
  • దేశవ్యాప్తంగా 10.6 లక్షల పోలింగ్‌ కేంద్రాలు

వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను వంద శాతం ఈవీఎంలతో నిర్వహించాలన్న ఉద్దేశంతో అందుకు అవసరమైన సన్నాహాలను చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 10 లక్షల 60 వేల పోలింగ్‌ కేంద్రాలకు అవసరమైన వోటర్‌ వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రైల్‌ (వీవీప్యాట్‌)లు సిద్ధం చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

సిద్ధం చేసిన యంత్రాలను పటిష్ట భద్రత మధ్య ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎవరికి ఓటు వేసినా ముందుగా ఫీడ్‌ చేసిన వారికే ఓటు పడుతోందని వస్తున్న విమర్శల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈ పారదర్శక సాఫ్ట్‌వేర్‌ను ఎన్నికల కమిషన్‌ అందుబాటులోకి తెచ్చింది. దీన్ని వినియోగించడం వల్ల ఒకసారి లాక్‌ చేసిన మిషన్‌ పనితీరును ఎవరూ మార్పు చేయలేరని చెబుతోంది. వీవీప్యాట్‌ల పనితీరును శాస్త్రీయంగా పరిశీలించేందుకు త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల సందర్భంగా అజ్మీర్‌, ఇండోర్‌, దుర్గ్‌, ఐజ్వాల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వినియోగించుకోనున్నట్లు తెలిపింది.

More Telugu News