Telangana: యాదాద్రిలో లడ్డూలకు బూజు.. 1800 లడ్డూలను పారబోసిన అధికారులు!

  • పాడైన లడ్డూ ప్రసాదం
  • నాణ్యతలో లోపం, గాలి ఆడక ఫంగస్
  • రూ.60 వేల నష్టం

తెలంగాణలోని పవిత్ర పుణ్య క్షేత్రమైన యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన లడ్డూలు బూజు పట్టాయి. మొత్తం 1800 లడ్డూలు పాడైపోయాయి. దీంతో వాటన్నింటినీ అధికారులు పడేశారు. ఫలితంగా రూ.60 వేల నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. తయారీలో నాణ్యత లోపించడం, భద్రపరిచే చర్యల్లో లోపాల కారణంగా లడ్డూలు పాడై ఫంగస్ వచ్చినట్టు తెలుస్తోంది. గురు, శుక్రవారాల్లో భక్తుల రద్దీ తగ్గడంతో ప్రసాదాల విక్రయం కూడా తగ్గిందని అధికారులు తెలిపారు. కౌంటర్ గదుల్లో లడ్డూలకు సరైన గాలి ఆడకపోవడంతోనే బూజు వచ్చినట్టు చెబుతున్నారు.

ప్రసాదాన్ని కొనుగోలు చేసిన భక్తుడు తినేందుకు లడ్డూను రెండు ముక్కలు చేయగా మొత్తం బూజు పట్టి కనిపించింది. దీంతో అతడు వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అప్రమత్తమైన అధికారులు 30 ట్రేలలో ఉన్న 1800 లడ్డూలను పారబోశారు. వీటి విలువ రూ.60 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News