queen movie: ‘క్వీన్’ దర్శకుడు ఓ నీచుడు.. నన్నూ లైంగికంగా వేధించాడు!: బాంబు పేల్చిన హీరోయిన్ కంగనా రనౌత్

  • షూటింగ్ లో దర్శకుడు వికాస్ అసభ్య ప్రవర్తన
  • గట్టిగా కౌలింగించుకునేవాడని ఆరోపించిన నటి
  • వికాస్ చేతిలో వేధింపులకు గురైన యువతికి మద్దతు
హాలీవుడ్ ను కుదిపేసిన ‘మీ టూ’ ఉద్యమం ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. తమను వేధించిన ప్రబుద్ధుల వివరాలను భారత్, చైనా సహా పలు దేశాలకు చెందిన నటీమణులు బయటపెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్, ఫిల్మ్ ఫేర్ అవార్డు విజేత కంగనా రనౌత్ బాంబు పేల్చింది. ‘క్వీన్’ సినిమా సమయంలో దర్శకుడు వికాస్ బెహెల్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. వికాస్ తనను వేధిస్తున్నాడని ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థకు చెందిన యువతి ఆరోపించిన నేపథ్యంలో కంగన ఆమెకు మద్దతుగా ముందుకొచ్చింది. ఫాంటమ్ ఫిల్మ్స్ ను దర్శకులు అనురాగ్ కశ్యప్, వికాస్, నిర్మాత మధు మంతెన కలిసి స్థాపించారు.

వికాస్ వేధించినట్లు సదరు యువతి చెబుతున్నది వందకు వంద శాతం నిజమేనని వెల్లడించింది. ‘క్వీన్ సినిమా షూటింగ్ సమయంలో వికాస్ నన్ను ఎప్పుడు కలిసినా విష్ చేస్తున్నట్లు కౌగిలించుకునేవాడు. కానీ అతను కౌగిలించుకుంటున్నట్లు నటిస్తూ గట్టిగా నలిపేసేవాడు. అది ఎవరికీ తెలియకపోవడంతో అతని నుంచి తప్పించుకునేందుకు చాలా యత్నించేదాన్ని.

 వికాస్ కు పెళ్లయినా పరాయి స్త్రీలతో సంబంధం ఉంది. ఇతరుల వ్యక్తిగత అలవాట్ల గురించి నేను తప్పుపట్టను. కానీ ఆ అలవాట్లు వ్యవసనంగా మారిపోయినప్పుడు బయటపెట్టడంలో తప్పులేదు. వికాస్ పార్టీల్లో బాగా తాగేవాడు. నేనేమో షూటింగ్ పూర్తయ్యాక హోటల్ గదికి వెళ్లిపోయి నిద్రపోయేదాన్ని. దీంతో నేను ఎక్కువగా నిద్రపోతానని ఎగతాళి చేసేవాడు’ అని కంగన చెప్పుకొచ్చింది.

‘క్వీన్‌’ సినిమా తర్వాత మరో స్క్రిప్ట్‌తో వికాస్ తనవద్దకు వచ్చాడనీ, అది నచ్చకపోవడంతో కథలో మార్పులు చేయాల్సిందిగా తాను సూచించానని కంగన తెలిపింది. దీంతో అహం దెబ్బతిన్న వికాస్ తనతో మాట్లాడటం మానేశాడని వెల్లడించింది. దీంతో ఆ ప్రాజెక్టు చేజారిపోయిందని పేర్కొంది. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదని చెప్పింది.
queen movie
kangana
vikas bhle
sexual harrasment
Bollywood

More Telugu News