modi: ప్రధానికి లేఖ రాసిన వీరప్పన్ ఎన్ కౌంటర్ కు సహకరించిన మహిళ

  • ప్రభుత్వం నుంచి రూ.5 కోట్ల పరిహారం ఇంకా అందలేదు
  • నా కూతురు ఆరోగ్యం బాగాలేదు
  • ముత్తులక్ష్మితో తనకు ప్రాణహాని ఉందన్న షణ్ముఖప్రియ

ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ను ఎన్ కౌంటర్ లో మృతి చెంది దాదాపు పద్నాలుగేళ్లవుతుంది. నాడు వీరప్పన్ ప్రతి కదలికపై పోలీసులకు సమాచారం అందించిన షణ్ముఖ ప్రియ తాజాగా వార్తల్లో నిలిచారు. వీరప్పన్ ను మట్టుబెట్టడానికి సహకరించిన తనకు ప్రభుత్వం నుంచి రూ.5 కోట్ల పరిహారం ఇంత వరకూ అందలేదని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు.

తన కూతురు ఆరోగ్యం బాగాలేదని ముత్తులక్ష్మితో తనకు ప్రాణహాని ఉందంటూ షణ్ముఖప్రియ ఆ లేఖలో పేర్కొంది. కాగా, వీరప్పన్ ను పట్టుకునేందుకు నాడు తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రారంభించిన ‘ఆపరేషన్ కుకూన్’. ఈ ఆపరేషన్ కు షణ్ముఖ ప్రియ సహకరించింది. వీరప్పన్ భార్య ముత్తలక్ష్మితో షణ్ముఖ ప్రియ సన్నిహితంగా ఉన్నట్టు నటించింది.

More Telugu News