కొత్తగూడెంలో దోపిడీ దొంగల బీభత్సం.. సాయిబాబా గుడిలో దారుణహత్య!
- హుండీలో సొమ్మును దోచుకెళ్లిన దొంగలు
- అడ్డుగా వచ్చిన వాచ్ మెన్ కిరాతక హత్య
- గాలింపు ప్రారంభించిన పోలీసులు
ఈ నేపథ్యంలో నిన్న కొందరు దుండగులు రాత్రిపూట గోడను దూకి ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో గుడిలో నిద్రిస్తున్న వెంకటరెడ్డి వారిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన దొంగలు ఓ రాడ్డుతో అతని తలపై మోదారు. అనంతరం విచక్షణారహితంగా దాడి చేయడంతో వెంకటరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక గుడిలోని హుండీలను పగులగొట్టి నగదును దోచుకుపోయారు. ఈ రోజు ఉదయం ఆలయానికి చేరుకున్న పూజారి దీన్ని గమనించి విషయాన్నిపోలీసులుకు తెలిపారు.
దీంతో జిల్లా ఎస్పీ సునీల్ దత్, డీఎస్పీ అలీ తమ సిబ్బందితో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి పరిస్థితులను పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపారు. గుడిలోని సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపును ప్రారంభించామనీ, త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ సునీత్ దత్ తెలిపారు.